చిరంజీవినే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు: పేర్ని నాని?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలపై చొరవ చూపుతోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం లో సినీ నిర్మాత సమావేశం ముగిసిన తరువాత పేర్ని నానీ మీడియాతో మాట్లాడుతూ.. ఆన్ లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్ లైన్ టికెటింగ్ కు అనుకూలంగా ఉందని తెలిపారు. అలాగే సినిమా టికెట్లపై నిర్దిష్ట విధానం అవసరమని గుర్తు చేశారు నాని. అయితే ఇప్పటికి కూడా ఈ ఆన్ లైన్ టికెటింగ్ విధానం కొనసాగుతోందని ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని తెలిపారు.

పరిశ్రమలు జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు నిర్మాతలు వచ్చారని, పరిశ్రమ అంతా ఐక్యమత్యం తోనే ఉందని తెలిపారు. టికెట్ ధర తక్కువగా ఉంటే ఇబ్బందుల్లో పడతామని నిర్మాణ వ్యయం కూడా పెరిగిందని నిర్మాతలు చెప్పినట్లు వివరించారు. కరోనా వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, దీనితో ప్రభుత్వం చొరవ చూపాల్సిందిగా కోరినట్లు మంత్రి చెప్పారు.

ఇప్పటివరకూ థియేటర్లలో ఉన్న 50 శాతం ఆక్యుపెన్సీ నీ 100 శాతం పెంచాల్సిందిగా కోరారని వెల్లడించారు. జగన్ సానుకూలంగా స్పందించారు అనుకుంటున్న సమయంలో ఒక నటుడి వల్ల దురదృష్టకర పరిణామాలు తలెత్తాయని వివరించారు. పవన్ కళ్యాణ్ అభిప్రాయాలకు తాము అనుకూలంగా లేమని, పవన్ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేసినట్లు మంత్రి నాని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా చిరంజీవి కూడా తనతో మాట్లాడారని ఆడియో ఫంక్షన్ లో జరిగిన పరిణామాలతో పరిశ్రమకు సంబంధంలేదని చెప్పినట్లు తెలిపారు.

Share post:

Latest