వామ్మో.. పవన్ పుట్టిన రోజు నాడు ప్రపంచ రికార్డు సృష్టించాడుగా?

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి, అలాగే ఆయన అభిమానుల గురించి ఇంకా చెప్పాల్సిన పనిలేదు. రెండు రాష్ట్రాలలో ఆయన సినిమా వచ్చింది అంటే పండుగ ఎలా ఉంటుంది. ఇక ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే చాలు మన దేశంతో పాటు వేరే దేశాలలో కూడా పెద్దఎత్తున పండుగగా జరుపుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ 2 ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అభిమానుల మానియానే కనిపిస్తూ ఉంటుంది. కేక్ కటింగ్ లు పాలాభిషేకాలు ఇలా ఎన్నో పవన్ అభిమానులు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు.

ఇక నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సామాన్యులతో పాటు తన అభిమానులు అలాగే సినీ సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు తుని లో ఒక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేసిన పుట్టినరోజు వేడుకలు ప్రపంచ రికార్డుగా సరి కొత్త చరిత్ర లిఖించింది. ఒకే గ్రౌండ్ లో 375 కేక్ ని కట్ చేసి కనీవిని ఎరుగని రీతిలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు చేశారు. ఈ పుట్టినరోజు వేడుకల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతోపాటు భారతదేశ ప్రజలు మొత్తం ఆశ్చర్యపోయే విధంగా వ్యక్తపరిచారు. ఈ విషయం తెలుసుకున్న చాలామంది పవన్ కు ఇంత క్రేజ్ ఉందా అని నోరెళ్లబెడుతారు.

Share post:

Popular