ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అలాంటి సాహసం..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలలో కష్టపడుతూ ఎన్నో పాత్రల్లో నటిస్తూ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇందుకోసం ఎన్నో కష్టాలను పడ్డారు. బాహుబలి సినిమా కోసం భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకు మేక్ఓవర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ రేషన్ అది చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం మరో సాహసం చేస్తున్నారట. అక్టోబర్ 9 వరకు 26 రోజులు సాగే ఈ లాంగ్ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

అయితే ఈ సన్నివేశాలను ప్రభాస్ డూప్ లేకుండా చేయనున్నారట. దానికోసం స్టంట్స్ రిహార్సల్ ఇప్పటికే మొదలుపెట్టారట. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళం,హిందీ, మలయాళం,కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Share post:

Popular