పాట పాడి త‌మ‌న్‌ను అడ్డంగా ఇరికించిన కీర్తి సురేష్‌..నెటిజ‌న్లు ఫైర్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కీర్తి.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోలు, వీడియోల‌తో త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది.

This is how Keerthy Suresh reacted when a fan asked her to marry him | Tamil Movie News - Times of India

ఈ క్ర‌మంలోనే తాజాగా కీర్తి ట్విట్ట‌ర్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె 1998లో విడుద‌లైన హాలీవుడ్‌కి చెందిన ‘బెల్లా చావో’ అనే ఆల్బ‌మ్‌లోని సాంగ్ పాడింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌పై ఫైర్ అవుతున్నారు. అస‌లు కీర్తి సాంగ్ పాడి వీడియో పోస్ట్ చేస్తే.. నెటిజ‌న్లు త‌మ‌న్‌పై మండిప‌డ‌టం ఏంటీ అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.

Thalapathy 65' music director Thaman wishes to hug THIS actor as the first thing after lockdown | Tamil Movie News - Times of India

నిజానికి ఏం జ‌రిగిందంటే..హాలీవుడ్‌కి చెందిన ‘బెల్లా చావో’ ఆల్బ‌మ్‌లోని ట్యూన్‌ని త‌మ‌న్ కాపీ కొట్టి మ‌హేష్‌- పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో తెర‌కెక్కిన‌ బిజినెస్‌మేన్‌లో ఉప‌యోగించుకున్నాడు. దీనిపై అప్ప‌ట్లో పెద్ద ర‌చ్చే జ‌రిగింది. ఇక ఇప్పుడు కీర్తిసురేష్‌ పుణ్య‌మా అని మ‌రోసారి నెటిజ‌న్స్ దగ్గ‌ర త‌మ‌న్ అడ్డంగా ఇరుక్కున్నాడు. దాంతో పాత విష‌యాన్ని గుర్తు చేసుకున్న నెటిజ‌న్లు.. మ‌ళ్లీ త‌మ‌న్‌ను ఏకిపారేస్తున్నారు.

Share post:

Latest