అర‌రే..నానికి పెద్ద చిక్కే వ‌చ్చిందిగా..ఫ్యాన్స్ ఆందోళ‌న‌?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి టాలీవుడ్ టాప్ హీరో వ‌ర‌కు ఎదిగిన న్యాచుర‌ల్ స్టార్ నానికి ఇప్పుడు ఓ పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. గ‌త కొంత కాలం నుంచి ఈయ‌న న‌టించిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మ‌ధ్య ఓటీటీలో భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన‌ వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు ఘోరంగా బోల్తా ప‌డ్డాయి.

Teaser Announcement: Nani's Birthday Gift To Arrive A Day Earlier! | Tupaki  English

వి, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలు ఓటీటీకి వెళ్లిన‌ప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చినా.. వాటి ఫ‌లితాలు చూసి బ‌తికాం రా దేవుడా అనుకుంటున్నారు బ‌య్య‌ర్లు. ఓ ర‌కంగా.. నాని కెరీర్‌లోనే ఇవి రెండూ పెద్ద డిజాస్ట‌ర్లు అని చెప్పాలి. అయితే వీటి నెగ‌టివ్ టాక్ ఇప్పుడు నాని త‌ర్వాతి చిత్రాల‌పై ప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. నాని ప్రస్తుతం శ్యామ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాల్లో న‌టిస్తున్నాడు.

Nani's upcoming movie Shyam Singha Roy shooting wrapped up, all eyes on  next movie 'Ante Sundaraniki' - IBTimes India

ఈ రెండు చిత్రాలు థియేట‌ర్‌లోనే విడుద‌ల కానున్నాయి. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న శ్యామ్‌ సింగరాయ్ సినిమా కోసం దాదాపు 40 కోట్ల బడ్జెట్ పెడుతుండ‌గా.. అంటే సుందరానికి సినిమాను దాదాపు పాతిక కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు అంత బిజినెస్ చేస్తాయా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఏదేమైనా ముందు సినిమాల ఫ్లాప్‌ టాక్.. నాని రాబోయే సినిమాల‌కు శాపంగా మార‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ కాస్త ఆందోళ‌న చెందుతున్నారు.

Nazriya Nazim Joins The Shoot Of Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante  Sundaraniki - IndustryHit.Com

Share post:

Popular