ఫ్యాన్స్‌కు స‌రికొత్త స‌వాల్ విసిర‌న నాగ‌శౌర్య‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య త‌న ఫ్యాన్స్‌కు స‌రికొత్త స‌వాల్ విసిరాడు. ఆ స‌వాల్ ఏంటీ..? అస‌లు విష‌యం ఏంటో..? తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నాగ‌శౌర్య ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ల‌క్ష్య‌` ఒక‌టి. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

Lakshya Movie (2021): Naga Shaurya | Cast | Trailer | Songs | Release Date  - News Bugz

భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో ‘లక్ష్య’ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. రిలీజ్ డేట్‌ను సోమ‌వారం ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర‌యూనిట్ వెల్ల‌డించింది. అయితే ఈలోపే శౌర్య త‌న ఫ్యాన్స్‌కు ఓ స‌వాల్ విసిరాడు. ల‌క్ష్య ఎప్పుడు విడుదల అవుతుందో ఊహించాలి అంటూ నాలుగు తేదీలను పెట్టి ఓ పోస్టర్‌ను త‌న ట్విట్ట‌ర్ ద్వారా వ‌దిలాడు.

Image

దాంతో ఒక్కొక్క‌రు ఒక్కో తేదీ చెబుతూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. మ‌రి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుందో తెలియాలంటే కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే. కాగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్ల మీద ఈ మూవీ నిర్మిత‌మైంది.