ఏంటీ.. నాగచైతన్య హీరో కాదా..?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అదిరిపోయే హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. కాగా అందాల భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులు బాగా నచ్చడంతో ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

- Advertisement -

కాగా ఈ సమయంలో నాగచైతన్య హీరో కాదు, నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రను పోలి ఉండే పాత్రలో కనిపిస్తాడనే ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే నాగచైతన్య నెగెటివ్ షేడ్స్‌తో కనిపించేది లవ్ స్టోరి చిత్రంలో కాదులెండీ.. ఆయన చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్టులో ఇలాంటి పాత్రలో కనిపిస్తాడట నాగచైతన్య. దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యు’ అనే సినిమాలో నటిస్తున్న చైతూ, మరోసారి ఈ డైరెక్టర్‌తో చేతులు కలుపుతున్నాడట. ఓ వెబ్ సిరీస్ కోసం వీరిద్దరు కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్‌లో చైతూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. లవ్ స్టోరి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చైతూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎలా కనిపిస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share post:

Popular