చార్లీ చాప్లిన్ గెటప్ లో నభా నటేష్.. ఫొటోస్ వైరల్?

టాలీవుడ్ హీరోయిన్ నభానటేష్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హాట్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు లో నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. సినిమా సినిమా కి తన అంటే ఏంటో నిరూపించుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది.

అంతేకాకుండా మరొకవైపు తన ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నభానటేష్ తాజాగా సోషల్ మీడియాలో ఒక సరదా ఫోటో షూట్ ను చేసింది. ఇందులో నభానటేష్ చార్లీ చాప్లిన్ గెటప్లో కనిపించడం విశేషం.

ఇటీవల ఓటీటీ లో విడుదలైన మాస్ట్రో సినిమాలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమాలో తనకు తగినంత ప్రాధాన్యత లభించలేదు. అందుకోసమే నేను ఇప్పుడు ఇలా ఫన్నీగా చార్లీచాప్లిన్ అవతారంలో కనిపించింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాయి. ఇవి చూసి అయినా సరే ఎవరైనా దర్శక నిర్మాతలు ఈ బ్యూటీ కి సినిమాల్లో చార్లి చాప్లిన్ వేషం ఇస్తారేమో చూడాలి మరి.