న‌భా న‌టేష్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..మ‌హేష్ మూవీలో బిగ్ ఛాన్స్‌?!

న‌భా న‌టేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు చేసినా ఆ స్థాయి హిట్ అందుకోలేక‌పోయినా న‌భా.. ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న `మాస్ట్రో` చిత్రంలో న‌టించింది.

Who is Nabha Natesh? Here's What We Know About The Famous Actor

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రం హాట్‌స్టార్‌లో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్న న‌భాను ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న మ‌హేష్ ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Trivikram Srinivas eyeing for another ex-actress for Mahesh Babu's film

ఈ మూవీలో పూజా హెగ్డే న‌టిస్తుంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ న‌భా ద‌క్కించుకుంద‌ట‌. త్వరలో దీనిపై చిత్ర బృందం నుంచి అనౌన్స్‌మెంట్ రానుందట. ఏదేమైనా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న న‌భాకు ఇదే బిగ్ ఛాన్స్ అనే చెప్పాలి.