మంచు ల‌క్ష్మీ, విష్ణు మ‌ధ్య గొడ‌వ‌లు..అక్క త‌ల బ‌ద్ద‌లుకొట్టేసిన త‌మ్ముడు!

సీనియ‌ర్ హీరో, టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు వార‌సులుగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మంచు ల‌క్ష్మీ, మంచు విష్ణు.. స్టార్స్‌గా ఎద‌గ‌లేక‌పోయినా త‌మ‌కంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తున్న ల‌క్ష్మీ, విష్ణులు గొడ‌వ ప‌డ్డార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆగ్ర‌హానికి గురైన విష్ణు అక్క త‌ల బ‌ద్ద‌లుకొట్టేశాడ‌ట‌.

Vishnu Condition Is Normal Said Manchu Lakshmi - Telugu Bullet

అయితే ఇది ఇప్పుడు జ‌రిగింది కాదులేండి. వారి చిన్న‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిన్న‌ప్పుడు మంచు విష్ణు మరియు మంచు లక్ష్మి కి మధ్య గొడవలు అవుతూ ఉండేవి అట. అయితే ఒక రోజు వీరిద్ద‌రూ తారా స్థాయిలో గొడ‌వ ప‌డ్డార‌ట‌. ఆ సమయం లో కోపంతో మంచు లక్ష్మి తన పక్కనే ఉన్న ఒక్క చెక్కని తీసుకొని మంచు విష్ణు తల మీద కొట్టింద‌ట.

Lakshmi Manchu and Vishnu manchu at Tirumala temple! | Fashionworldhub

దాంతో విపరీతమైన కోపం తెచ్చుకున్న మంచు విష్ణు అదే చెక్కని తీసుకొని ఆపకుండా మంచు లక్ష్మి తల మీద కొట్ట‌డంతో.. లక్ష్మి స్పృహ కోల్పోయింద‌ట‌.ఆ టైమ్‌లో విష్ణుకు ఏం చేయాలో అర్థం కాలేద‌ట‌. వెంట‌నే తాత సాయంతో ల‌క్ష్మిని హాస్ప‌ట‌ల్‌ లో చేర్చ‌గా.. అక్క‌డ ఆమె త‌ల‌కు ఆరు కుట్లు ప‌డ్డాయ‌ట‌. ఇక ఇది తండ్రికి తెలిస్తే చావ‌బాదుతాడ‌ని విష్ణు తెగ భ‌య‌ప‌డిపోయాడ‌ట‌. ఈ విష‌యాన్ని నాన్న‌కు చెప్పొద్దంటూ తాత‌ను ఎంత‌గానో బ్రతిమిలాడాడ‌ట‌. అయితే కొన్ని రోజుల‌కు విష‌యం తెలుసుకున్న మోహ‌న్ బాబు.. మంచు ల‌క్ష్మి, విష్ణుల‌ను పిలిచి స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చి కొట్ట‌కుండా వ‌దిలేశార‌ట‌.