తేజ్ అలాంటి వాడు కాదు..యాక్సిడెంట్‌పై మంచు ల‌క్ష్మీ ట్వీట్ వైర‌ల్‌

టాలీవుడ్ హీరో, చిరంజీవి మేన‌ల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన తేజ్‌.. ప్ర‌స్తుతం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఉదయం నుంచి తేజ్ కు పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు..ఆయ‌న‌కు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా ఆందోళ‌న పడాల్సిన పని లేదని తెలిపారు.

Sai Dharam Tej Accident: Police Version!

ఇదిలా ఉండగా… తేజు ప్రమాదానికి గురికావడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతివేగం వ‌ల్లే యాక్సిడెంట్ అయింద‌ని కొంద‌రు అంటుంటే.. ఇసుక వ‌ల్ల స్కిడ్ ప‌డ్డాడ‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. ఇక మ‌రోవైపు రేసింగ్ వల్లే సాయితేజ్ బైక్ ప్రమాదానికి గురైందని పుకార్తు పుట్టుకొచ్చాయి. అయితే ఈ పుకార్త‌పై మంచు ల‌క్ష్మీ స్పందించింది.

Sai Dharam Tej meets with a bike accident: Pawan Kalyan, Vaishnav Tej, Varun Tej, Niharika Konidela & other family members rush to hospital | Telugu Movie News - Times of India

`నాకు తెలిసిన రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఎలాంటి సందర్భంలోనూ సాయిధరమ్ తేజ్ అతివేగంతో వెళ్ళడు. వెళ్లే వ్య‌క్తి కాదు. రోడ్డుపై ఉన్న మట్టి కారణంగానే ప్రమాదం జరిగింది. దయచేసి అన‌వ‌స‌ర‌మైన పుకార్లు క్రియేట్ చేయొద్దు. ప్రస్తుతం తేజు ఆరోగ్యం నిలకడగా ఉంది. త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి` అంటూ ట్వీట్ చేసింది. దాంతో ఆమె ట్వీట్ వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు టాలీవుడు సినీ ప్ర‌ముకులు, రాజ‌కీయ నాయ‌కులు, అభిమానులు తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు.

Share post:

Latest