తెలంగాణ‌లో విషాదం..నిండు ప్రాణాన్ని బ‌లితీసుకున్న మిరపకాయ బజ్జీ..!

మృత్యువు ఎప్పుడు, ఏ క్ష‌ణాన‌, ఏ రూపంలో వ‌స్తుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు మ‌రియు ఊహించ‌నూలేరు. తాజాగా ఓ వ్య‌క్తికి మిర‌ప‌కాయ బ‌జ్జీనే య‌మ‌పాశ‌మైంది. అవును, తాజాగా ఓ నిండుప్రాణాన్ని మిర‌ప‌కాయ బ‌జ్జీ బ‌లితీసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న తెలంగాణ‌లో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన మల్లేశ్ కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.Minor Indian migrant girl died of heat stroke near US-Mexico border:  Official | India News – India TV

అయితే వ్యక్తిగత పనుల కార‌ణంగా మంగ‌ళ‌వారం సొంత గ్రామానికి వ‌చ్చిన మ‌ల్లేశ్‌.. రాత్రి వేళ ఇంటి డాబాపై కూర్చోని హోటల్ నుంచి తెచ్చుకున్న మిర‌పాకాయ బ‌జ్జీల‌ను ఇష్టంగా తింటున్నాడు. కానీ, తనకు ఎంతో ఇష్టమైన ఆ బజ్జీ తన ప్రాణం తీస్తుందని అతడు ఊహించలేకపోయాడు. బ‌జ్జీలు తింటుండ‌గా.. ఓ బ‌జ్జీ ముక్క గొంతుకు అడ్డుపడింది.

దీంతో ఊపిరి ఆడ‌క అరవడానికి కూడా అతడికి నోరు రాలేదు. ఈ క్ర‌మంలోనే తీవ్ర ఇబ్బంది పడుతూ.. అక్కడిక‌క్కేడే మృతి చెందాడు. త‌ర్వాతి రోజు ఉద‌యం కుటుంబ‌స‌భ్యులు డాబాపైకి వెళ్ల‌గా.. అప్ప‌టికే మ‌ల్లేశ్ మృతి చెంది ఉన్నారు. దాంతో కుటుంబ‌స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. మ‌రోవైపు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు..నిజంగానే బజ్జీ గొంతులో అడ్డుపడి చనిపోయాడా? లేక మ‌రేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో విచార‌ణ చేప‌ట్టారు.

Share post:

Popular