బాలీవుడ్ నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి.?

బాలీవుడ్ హీరో దివంగత నటుడు సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత బాలీవుడ్ నెపోటిజం పై జరిగిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై కంగనా రనౌత్, నిర్మాత కరణ్ జోహార్ తో పాటు పలువురు సినీ పెద్దలపై, అలాగే పలువురు సెలబ్రిటీల పై విమర్శలను గుప్పించింది. ఇది ఇలా ఉండగా తాజాగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నటి మల్లికా షెరావత్ నెపోటిజం ను మరొక సారి తన వ్యాఖ్యలతో తెరపైకి తీసుకొచ్చింది. ఇటీవలే బాలీవుడ్ లైఫ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజం పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. హీరోల గర్ల్ ఫ్రెండ్స్, చెల్లెలు, బంధువులు కారణంగా చివరి క్షణాల్లో నన్ను సినిమాలనుంచి తప్పించారని తెలిపింది. నెపోటిజం కారణంగా నాకు వచ్చిన ఎన్నో సినిమా అవకాశాలు చేజారిపోయాయి. కొన్నిసార్లు అయితే నా స్థానంలో హీరో గర్ల్ ఫ్రెండ్స్, మరికొందరు ప్రియురాళ్లు నటుల చెల్లెళ్ళు బంధువులను తీసుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఈ పరిశ్రమలో సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది ఎప్పటికీ మారదు, అందువల్లే ఇవేవీ నన్ను బాధించలేదు. అసలు వీటి గురించి నేను అంతగా పట్టించుకునే దాన్ని కాదు నా స్వయంశక్తి నమ్ముకున్నాను అని చెప్పుకొచ్చింది మల్లికా.

Share post:

Popular