డాషింగ్ & డేరింగ్ డేరెక్టర్ పూజా జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసి సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ బర్త్‌డే నేడు.
ఈ సందర్భంగా సినీ ప్రముక్షులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పూరీకి స్పెషల్ విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే పూరీ సర్.. ఆనందం మరియు గొప్ప ఆరోగ్యం తో ఈ ఏడాదిని గడపండి` అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే మహేష్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత నిర్మాత ఛార్మీ కౌర్ థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చింది.
బ్యాక్ టు బ్యాక్ వర్క్ వల్ల పూరీ జగన్నాథ్ ఈ ఏడాది జనవరి 11 నుంచి సోషల్ మీడియాకు దూరమయ్యారు. అందు వల్లనే, పూరీకి విషెస్ చెప్పిన వారందరికి ఛార్మీనే రిప్లై ఇస్తోంది. కాగా, మహేష్ బాబు తో పూరి జగన్నాథ్ గతం లో పోకిరి, బిజినెస్ మేన్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరి మూడో కాంబో కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.
Thank u so much .. love and respect 💕
Puri garu says “LOVE U “ … https://t.co/anp9uaNtxp— Charmme Kaur (@Charmmeofficial) September 28, 2021