మహాతల్లి.. మేధావి.. నిక్కర్ వద్దంటే..చివరకు ఎగ్జామ్ అలా..?

సాధారణంగా ఎవరైనా సరే ఎగ్జామ్ హాల్ కి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఎగ్జామ్ ఆఫ్ లైన్ అయితే రాయడానికి కావలసిన అన్ని పరికరాలు తీసుకెళ్లడంతో పాటు ఇటీవల నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించడం ఉపయోగించడం వంటివి చేయాల్సి ఉంటుంది.. అంతేకాదు డ్రెస్ కోడ్ కూడా చాలా ముఖ్యమని చెబుతున్నాయి కొన్ని విద్యాసంస్థలు.. ఇకపోతే ఇక్కడ ఒక అమ్మాయి ఎగ్జామ్ సెంటర్కు షార్ట్ వేసుకుని వచ్చి ఉంటే ఆమెను ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాయడానికి అనుమతి ఇవ్వలేదట.. ఈమె చివరకు ఏం చేసిందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

అస్సాంలోని బిశ్వనాథ్ చారియాలి అనే గ్రామానికి చెందిన 19 యేళ్ళ జూబ్లీ అనే అమ్మాయి .. బుధవారం తన స్వగ్రామం నుంచి తేజ్‌పుర్‌లో గిరిజానంద చౌదరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ సెంటర్ కు .. అస్సాం అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (ఏఏయూ) రాసేందుకు..తన తండ్రితో కలిసి వచ్చింది.
ఆమెను సెంటర్‌ లోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ గార్డ్స్‌ అనుమతించారు. కానీ ఎగ్జామ్‌ హాల్‌ లోపలికి వెళ్ళే సమయంలో షార్ట్ ధరించిందని , ఇన్విజిలేటర్ పరీక్ష హాలుకు అనుమతి ఇవ్వలేదు..

దాంతో ఈ యువతి ఏడ్చుకుంటూ బయటకు వచ్చి తన తండ్రితో విషయాన్ని చెప్పింది. దాంతో ఆమె పరీక్ష రాసేలా చూడాలని ఎగ్జామ్స్‌ కంట్రోలర్‌ని అడిగితే.. ప్యాంట్ వేసుకొస్తే తప్ప లోపలికి రానివ్వమని చెప్పాడు.ఇక చేసేదేమీ లేక ఆ తండ్రి 8 కిలోమీటర్లు ప్రయాణంచి, మార్కెట్‌లోకి వెళ్లి ట్రౌజర్‌ తీసుకొచ్చారు. ఈలోపే ఆమె కర్టెన్‌తో తన కాళ్లు కప్పి , పరీక్ష రాసింది. అయితే పరీక్ష అనంతరం యువతి విలేకరులతో మాట్లాడుతూ జరిగింది మొత్తం చెప్పింది. కొన్నిరోజుల క్రితం నీట్‌పరీక్ష రాసేందుకు ఇదే డ్రెస్‌లో వెళ్లానని.. అయినప్పటికీ అక్కడ ఎలాంటి ఆంక్షలు విధించలేదన్నారు. ఏఏయూ వాళ్లు సైతం డ్రెస్‌కోడ్‌ గురించి చెప్పలేదు. కోవిడ్ నిబంధనలు పాటించడం పోయి డ్రెస్ కోడ్ గురించి అవమానించారు అంటూ ఆమె తీవ్రంగా బాధపడింది.