కుటుంబంతో గొడవపడిన అనుష్క.. ఏకంగా అక్కడికి జంప్..?

అనుష్క శెట్టి సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరు.. అరుంధతి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనుష్క , ఆ తర్వాత తను ఏ సినిమా చేసినా కూడా అది మంచి విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన కూడా నటించిన ఈ కన్నడ కుట్టి , తెలుగులో ఎన్నో విజయాలను అందుకుంది. స్టార్ హీరోలు కూడా అనుష్క కోసం తమ డేట్స్ కూడా మార్చుకునే వారట. మొదటిసారిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన అనుష్క, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది..

నాలుగు పదుల వయసు వస్తున్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే జీవితం గడుపుతోంది అనుష్క. ఈ విషయంపై ఎవరైనా అడిగితే.. అప్పుడే పెళ్ళికి తొందరెందుకు అంటూ మాట దాటివేస్తుంది అనుష్క. ఇకపోతే ఇటీవల కుటుంబంలో గొడవలు జరిగాయని, ఇక కుటుంబంలో ఉండడం ఇష్టం లేక ఆమె ఉత్తరాఖండ్ కు వెళ్లిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గొడవ అంటే, అది కేవలం ఆమె పెళ్లి విషయమై ఉంటుందని మరి కొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..

అంతేకాదు ఇప్పట్లో సినిమాలు చేయమని అడిగితే, ప్రస్తుతం చెయ్యను కొంతకాలం తర్వాత చేస్తాను అంటూ చెబుతోందట అనుష్క. అయితే ఇందుకు గల పూర్తి కారణాలు తెలుసుకోవాలి అంటే అనుష్క నోరు విప్పే వరకు మనం ఎదురు చూడాల్సిందే.

Share post:

Latest