గొడ్డలి పట్టి గుడ్ న్యూస్ చెప్పిన‌ వైష్ణవ్ తేజ్..మ్యాట‌రేంటంటే?

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌, మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కొండ పొలం`. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. సాయిబాబు – రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తాజాగా వైష్ణ‌వ్ తేజ్ గొడ్డ‌లి ప‌ట్టి త‌న అభిమానుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు.

కొండ పొలం- మెలోడియస్ 'ఓబులమ్మ' సాంగ్ రిలీజ్ | The2States : Online Breaking  News, Latest News in Telugu

ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను సెప్టెంబ‌ర్‌ 27వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 3:33 నిమిషాలకు విడుద‌ల చేస్తున్నామ‌ని తెలిపుతూ చిత్ర యూనిట్ ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో వైష్ణవ్‌ ఓ గొడ్డలి పట్టుకొగా.. ఆ గొడ్డలిపై సినిమాలోని కొన్ని పాత్రలను రూపొందించారు.

Image

మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, కొండప్రాంతం.. గిరిజన గూడెంలోని జీవన విధానం.. అక్కడ ఉన్న సమస్యలను కలుపుకుని సాగే అందమైన ప్రేమకథ ఈ సినిమా. ఇప్ప‌టికే భారీ అంచ‌నాల‌ను పెంచుకున్న ఈ చిత్రం అక్టోబర్ 8వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Share post:

Popular