బిగ్‌బాస్‌5: రెండు వారాల‌కు ఉమాదేవి ఎంత పుచ్చుకుందో తెలిస్తే షాకే?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మూడో వారం కొన‌సాగుతోంది. రెండో వారం నామినేషన్‌లో ఉమాదేవి, నటరాజ్‌, కాజల్‌, లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్ ఉండ‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే కార్తీక‌దీపం సీరియ‌ల్ ఫేమ్ ఉమాదేవి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది.

Announcements: There are 5 Bigg Boss contestants - Heytamilcinema

ఇక హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉమాదేవి వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. తన ఎలిమినేషన్ పట్ల విచారం వ్యక్తం చేసిన ఉమాదేవి..అవకాశం ఇస్తే మళ్లీ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించింది.

Bigg Boss Exclusive: Uma Devi Eliminated! -

ఇదిలా ఉంటే.. రెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఉమాదేవి రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఉమాదేవి కేవ‌లం రెండు వారాల‌గానూ ఏకంగా రూ. ల‌క్షా ఎన‌బై వేల నుంచి రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోష‌కంగా పుచ్చుకుంద‌ని తెలుస్తోంది.

Share post:

Latest