జగనన్న మజాకా.. ఆ ఒక్క హోటల్.. కరెంటు బిల్లు ఎన్ని కోట్లో తెలుసా..?

జగన్ ప్రభుత్వం పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ఈ మధ్యనే కరెంటు బిల్లులు పెంచిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ విషయంపై కూడా ప్రజలు గుర్రుమని ఉన్నారు జగన్ మీద.అయితే ఇప్పుడు ఒక చిన్న హోటల్ కి సంబంధించి కరెంట్ బిల్ కొన్ని కోట్ల రూపాయలు వచ్చిందట.ఆ బిల్లు చూసి లబోదిబో మంటున్నారు హోటల్ యజమానులు.ఆ వివరాలు ఏంటో చూద్దాం.

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామం లో ఒక చిన్న హోటల్ యజమాని సాయినాగమణి.ఇమే కొత్త బస్టాండ్ సమీపంలో టిఫిన్ హోటల్ నడుపుతున్నారు.ఈమెకు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఏకంగా.. రూ.21,48,62,224 విద్యుత్ బిల్లు ఆమె చేతులో పెట్టడంతో ఆశ్చర్యపోయింది.

తిరిగి అధికారులను సంప్రదించగా సాంకేతిక లోపం కారణంగానే బిల్లు తప్పు వచ్చిందని తెలియజేశారు ట్రాన్స్ కో ఏఈ శంకర్రావు తెలిపారు.ఇక అప్పుడప్పుడు ఇలాంటివి సాంకేతిక సమస్యల వల్ల బిల్లులు తారుమారు అవుతాయని వెల్లడించారు ఎస్ జనార్దన్ రావు.బిల్లు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీటర్ రీడర్స్ ప్రభాకర్ ను విధుల నుంచి తొలగించామని,చింతల పూడి ఏఈ శంకర్ రావ్ సస్పెండ్ చేశామని తెలియజేశారు.