ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రూ.70 వేలు ఉచితంగా..!

ద్వితీయ సంవత్సరం కూడా పాసైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఎవరైతే పన్నెండవ తరగతి పాస్ అయి ఉంటారో, అలాంటి విద్యార్థుల నుంచి కాలర్ షిప్ స్కీం – 2021 కింద దరఖాస్తులను కేంద్ర విద్యా శాఖ ఆహ్వానిస్తోంది.. వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులు ఈ స్కీం నుండి స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులు.. పై చదువులు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసం కేంద్ర విద్యా శాఖ.. ఈ స్కీం కింద స్కాలర్ షిప్ ను అందించడానికి సిద్ధమవుతోంది.. ఈ స్కీం ద్వారా ఎంపికైన విద్యార్థులకు మొదటి మూడేళ్లపాటు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఉచితంగా ఇస్తారు. 4, 5 సంవత్సరాలలో సంవత్సరానికి రూ. 20 వేల చొప్పున స్కాలర్ షిప్ లభిస్తుంది. అంటే మొత్తం మీద ఐదు సంవత్సరాలకు గానూ 70 వేల రూపాయలను స్కాలర్షిప్ కింద విద్యార్థులు పొందవచ్చు.

scholarships.gov.in అనే వెబ్సైట్ ద్వారా లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు.