ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న ఎన్టీఆర్.. ఎన్ని లక్షలు అంటే..?

September 23, 2021 at 6:57 am

టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఎక్కువ కార్ల మీద మక్కువ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక లగ్జరీ కారును ఇటలీ నుంచి తేప్పించుకున్నాడు.అయితే తారక్ ఆ కార్ కి గల నెంబర్ కోసం.. కొన్ని లక్షల రూపాయలను గుమ్మరించినట్లు తెలుస్తోంది. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నెంబర్లకు వేలం వేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ తన కారుకు TS 09 FS 9999 అనే నెంబర్ ను 17 లక్షల రూపాయలు పెట్టి దక్కించుకున్నాడు.

మంగళవారం జరిగిన వేలం పాటలో ఫ్యాన్సీ నెంబర్లుల లో ఇదే హైయెస్ట్ అని అధికారులు తెలియజేస్తున్నారు. గతంలో తారక్ 10 లక్షల రూపాయలు పెట్టి ఒక ఫాన్సీ నెంబర్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా 17 లక్షల రూపాయలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకొని తన రికార్డును తానే బద్దలు కొట్టుకోవడం విశేషం.

ఇక తారక్ ని దగ్గర మొత్తం కార్లు అన్నిటికీ..9999 అనే నెంబర్ ఉంటుంది కొత్తగా ఏ కాదు తీసుకున్నా కూడా ఈ నెంబర్ మీదే దృష్టి పెడతాడు ఎన్టీఆర్. ఇక అంతే కాకుండా ఎన్టీ రామారావు, హరికృష్ణ కూడా ఇదే నెంబర్ వాడే అన్నట్లుగా తెలుస్తున్నది. అందుచేతనే దీనికి అంత ప్రాధాన్యత ఇస్తాడు ఎన్టీఆర్. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్విట్టర్ కూడా ఇదే నెంబర్ ఉండడం గమనార్హం. (Tarak@9999).

ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న ఎన్టీఆర్.. ఎన్ని లక్షలు అంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts