ఇద్దరు యువతుల తో ప్రేమాయణం జరిపిన వరుడు.. తన పెళ్లి ఎలా ఫిక్స్ చేశారంటే..?

ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఇ ఇద్దరు యువతులను లవ్ చేసి ఆ తర్వాత ఆ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. అతను ఎవరు అలా ఎందుకు చేసింది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లోని ట్విస్టులు సినిమాలలో కూడా చూసి ఉండరు. కొద్ది నెలల్లో కొనసాగుతున్న ఈ ప్రేమ కథకు లాటరీ పద్ధతి తో శుభం కార్డు పడేలా చేసింది.ఈ విచిత్రమైన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది.

అసలు విషయానికి వెళ్తే సకలేశపుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం కొనసాగించాడు. చివరికి ఆ ఇద్దరు యువకులకు తెలిసిన అతన్ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు.దీంతో ఈ పంచాయతీ కాస్త పెద్దల ముందుకు వెళ్ళింది.

ఈ సమస్యకు పరిష్కారం కాకపోవడంతో ఇదే సమయంలో ఓ యువతి అతని లేని జీవితం తనకు వద్దని చెప్పి విషం తాగి ఆత్మహత్య చేసింది.గ్రామస్తులు ఆమని హుటాహుటిగా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయట పడింది.చికిత్స అనంతరం కోలుకొని ఆమె ఇంటికి వెళ్లి గ్రామానికి తిరిగి వచ్చింది.దాంతో తాజాగా మరొకసారి ఈ వ్యవహారంపై పంచాయతీ జరగగా..దీనిపై ఒక పరిష్కారాన్ని చూపిస్తూ లాటరీ పద్ధతి ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని యువతులకు చెప్పారు.

ఆ ఇద్దరు యువతులు కూడా ఓకే చెప్పడంతో లాటరీ తీయగా,విషం తాగిన అమ్మాయి పేరు వచ్చింది దీంతో అదే రోజు ఆమెతో వివాహం జరిపించారు.