లీకైన చ‌ర‌ణ్-శంక‌ర్ మూవీ టైటిల్‌..అదిరిందంటున్న ఫ్యాన్స్‌?!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

అయితే ఈ భారీ బ‌డ్జెట్ చిత్రానికి శంక‌ర్ ఓ అదిరిపోయే టైటిల్‌ను ఖ‌రారు చేశార‌ట‌. ఇప్పుడు ఆ టైటిల్ లీకై నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ ఈ సినిమా ఏం టైటిల్ ఫిక్స్ చేశారంటే.. `విశ్వంభర`. సినిమా క‌థకు ఆ టైటిల్ క‌రెక్ట్‌గా సూట్ అవుతుంద‌ని శంక‌ర్ భావిస్తున్నార‌ట‌. మ‌రోవైపు చ‌ర‌ణ్‌కు సైతం టైటిల్ బాగా నచ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని టాక్‌. ఈ నేప‌థ్యంలోనే చ‌ర‌ణ్ ఫ్యాన్స్ టైటిల్ అదిరిపోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రానికి యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్‌.ఎస్‌. త‌మన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లె త‌మ‌న్ పాటల రికార్డింగ్ కూడా షురూ చేసేశాడు.