డేవిడ్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..ఇక సన్ రైజర్స్‌లో వార్న‌ర్ లేన‌ట్టే..?!

ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్‌ పుణ్యామా ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ముఖ్యంగా తెలుగువారితో వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే ఇప్పుడు ఈయ‌న అభిమానులంద‌రికీ బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోంది. త‌న‌దైన ఆట తీరు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు గుడ్‌ బై చెప్పేయ‌బోతున్నాడ‌ట‌.

IPL 2021: David Warner all but signals exit from Sunrisers Hyderabad, see  reply HERE | Cricket News | Zee News

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. దాంతో మొదట అతడిని కెప్టెన్సీ నుంచి తొలిగించ‌గా.. ఇప్పుడు తుదిజట్టులో స్థానాన్ని కూడా కోల్పోయాడు. రానున్న మ్యాచ్ లలోనూ వార్నర్ ని పక్కనపెట్టె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సీజన్ తో డేవిడ్ వార్నర్ హైదరాబాద్ జట్టుకు గుడ్ బై చెప్పనున్నాడు.

David Warner: An endearing family man and a social media sensation | Sports  News,The Indian Express

ఇప్పటికే ఐపీఎల్ 2022 కోసం రిటైన్ ఆప్షన్ లో హైదరాబాద్ జట్టు విదేశీ ఆటగాళ్ళ లిస్టులో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ ని రిటైన్ చేసుకోనుంది. దాంతో డేవిడ్‌ వార్నర్‌ వేలంలోకి వస్తే.. అత‌డిని దక్కించుకోవాలని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చూస్తోంద‌ట‌. వచ్చే సీజన్‌లో కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకోబోతున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ఎలాగైనా వార్నర్‌ని దక్కించుకోవాలని ఆర్సీబీ ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చేస్తున్నాయి. దాంతో ఆర్సీబీ నెక్స్ట్ కెప్టెన్‌ వార్నర్ అంటూ ప్ర‌చారం ఊపందుకుంది.

Share post:

Latest