చిరంజీవితో కలిసి ‘కుమ్మేసిన’ సాయి పల్లవి..!

టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఈమె సినిమాలో ఉందంటే ఆ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఒంపుసొంపులతో వేసేటువంటి డాన్స్ తో ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తూ ఉంటుంది సాయి పల్లవి.ఈమె హీరోయిన్ గా కావడానికి ముఖ్యకారణం ఆమె డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక నిన్న జరిగిన లవ్ స్టోరీ ఆడియో ఫంక్షన్ లో ఎందరో స్టార్స్ సైతం ఈవెంట్ కి వచ్చారు.

ఇక అందులో ముఖ్యఅతిథిగా చిరంజీవి,అమీర్ ఖాన్ రావడం జరిగింది. ఈవెంట్ లో సాయి పల్లవి డాన్స్ వేయమని అందరూ కోరగా.. చిరంజీవి సార్ వేస్తే నేను వేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. కానీ చిరంజీవి మటుకు ససేమిరా ఒప్పుకోలేదు. దాంతో మొదట సాయి పల్లవి డాన్స్ వేయగా.. తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే పాటకి చిరంజీవి, సాయి పల్లవి డాన్స్ ఇద్దరు వేసి అదరగొట్టారు.

చిరంజీవి సాయి పల్లవి తో మాట్లాడుతూ నీ డాన్స్ ఎంతో బాగుంది అన్నట్లుగా తెలియజేశాడు. ఇక సాయిపల్లవి నాతో నటించానని చెప్పింది ది అన్నట్లుగా నవ్వుతూ తెలియజేశాడు చిరంజీవి. ఎట్టకేలకు చిరంజీవితం తను వేయాలనుకున్న డాన్స్ కల నెరవేరిందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.https://youtu.be/6ZI2SwnPuxs

Share post:

Popular