గాడ్ ఫాదర్ సినిమా కోసం రంగంలోకి దిగిన చిరు?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది.అయితే తాజాగా ఈ షూటింగ్ పోటీలో ప్రారంభమయ్యింది. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేర్కొంది.

అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కుష్బూ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై త్వరలోనే అధికారికంగా క్లారిటీ రానుంది. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు చిరంజీవి. తాజాగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుండగా అందుకోసం చిరంజీవి రంగం లోకి దిగినట్లు తెలుస్తోంది.

Share post:

Popular