ఛీ..ఆర్జీవీ మరీ ఇంత దిగజారుతాడనుకోలేదు..!

September 7, 2021 at 9:55 pm

ఆర్జీవీ..ఇటీవల కాలంలో ఈ పేరు వింటేనే చాలా మంది అమ్మాయిలు అసహ్యించుకుంటున్నారు. అప్పట్లో ఆర్జీవి అనగానే ఒక ప్రముఖ దర్శకుడిగా ఆయనకు ఎంతో విలువ ఉండేది. అంతేకాదు శివ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపుపొందిన , ఆ తర్వాత తన కింద ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా పెట్టుకున్నాడు. ఇక అప్పట్లో తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ లుగా పనిచేసిన ఎంతో మంది డైరెక్టర్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లుగా కొనసాగుతున్నారు. అంత గొప్ప డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఆయన ఇటీవల కాలంలో అన్ని అడల్ట్ చిత్రాలపై ఫోకస్ చేయడం గమనార్హం.

కొత్త వాళ్ళను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, వారి లో దాగి ఉన్న అందాలను బయటకు తీసి ప్రేక్షకులకు చూపిస్తూ, వారి ఇమేజ్ ను పెంచాలని చూస్తున్నాడు. ఇటీవల కాలంలో అమ్మాయిలతో రకరకాలుగా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారితో ఉన్న ఫోటోలను, వీడియోలను కూడా తానే స్వయంగా విడుదల చేయడంతో అందరూ ఛీ అని అనుకుంటున్నారు.

ఇటీవల అషురెడ్డి తో జరిగిన ఒక సంఘటన చూసి.. ఆర్జివి మరి ఇంత జారిపోతాడు అనుకోలేదు అంటూ నెటిజన్లు తెగ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆమె తో కలిపి ఒక వీడియో షూట్ చేయగా ..అందులో నీ టైస్ చాలా బాగున్నాయి అనడంతో ఆమె లాగిపెట్టి చెంప దెబ్బ కొట్టింది. అదే వీడియో లోనే ఆమెను ఇంప్రెస్ చేస్తూ ఏకంగా కాళ్లనే పట్టుకోవడం గమనార్హం. ఇది చూసిన నెటిజన్ల అంతా ఆర్జివి పై కోపం వ్యక్తం చేస్తున్నారు.

ఛీ..ఆర్జీవీ మరీ ఇంత దిగజారుతాడనుకోలేదు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts