చరిత్రను తలపిస్తున్న సర్దార్ ఉద్దమ్ ట్రైలర్.. అదిరిందిగా..!

September 30, 2021 at 7:47 pm

సాధారణంగా మన దేశంలో స్వాతంత్ర సమరయోధులు అనగానే మహాత్మాగాంధీ మొదలుకొని.. జవహర్ లాల్ నెహ్రూ , సుభాష్ చంద్రబోస్ , సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ లాంటి ఎంతో మంది ప్రముఖుల పేర్లు గుర్తొస్తాయి .. ఇక జాతీయ స్థాయిలో విశేష ఆదరణ సంపాదించుకున్న వీరు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలుగా ఉండటం వల్ల అప్పటికీ, ఇప్పటికీ వీరి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు..

అయితే స్వాతంత్ర సమరంలో వీరికి దీటుగా పోరాడిన వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు.. కానీ వీరికి చరిత్రలో ఎలాంటి చోటు దక్కలేదు.. ఇక తర్వాత తరాల వారు కూడా వీరి పేర్లను చరిత్రలో ఎక్కించే ప్రయత్నాలు కూడా జరగలేదు.. కానీ ఇటీవల కొంతమంది ఫిలింమేకర్స్ చరిత్ర మరిచిన కొందరు యోధులను , వారి చరిత్రను తిరిగి ఈ తరానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రమే సర్దార్ ఉద్ధమ్..

ప్రముఖ దర్శకుడు షూజిత్ సిర్కార్ దర్శకత్వంలో ఒక యువనటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ఇది. స్వాతంత్రానికి పూర్వం జలియన్ వాలాబాగ్ ఉదంతం ఇప్పటికీ చదివినా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి.. జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో గుమికూడిన వేలాది మంది పై అప్పటి బ్రిటీష్ అధికారి జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కొన్ని వేల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.. ఈ దారుణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూసి, లక్ష్యసాధన కోసం ఇంగ్లాండ్ కూడా వెళ్లి న సర్దార్ ఉద్ధం సింగ్ కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా, ఈ ట్రైలర్ చూస్తేనే ఇది ఒక ఎపిక్ మూవీ లాగా అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

చరిత్రను తలపిస్తున్న సర్దార్ ఉద్దమ్ ట్రైలర్.. అదిరిందిగా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts