ప్ర‌భాస్‌తో న‌టించాల‌నుందా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకే!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన‌ ప్ర‌భాస్ తో న‌టించాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. ఆయ‌న సినిమాలో చిన్న రోల్ అయినా చేయాల‌ని తెగ ఇంట్ర‌స్ట్ చూపుతుంటారు. ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌. తాజాగా ప్ర‌భాస్ సినిమాకి సంబంధించి కాస్టింగ్ కాల్ వ‌చ్చింది.

Prabhas Height, Girlfriend, Caste, Family, Net worth, Biography & More - BigstarBio

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, స‌లార్ చిత్రాల‌తో పాటుగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో దీపిక పదుకోనె హీరోయిన్‌గా, అమితాబ్‌ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Amitabh Bachchan, Deepika Padukone, and Prabhas get together for the upcoming film named 'Project-K'

అయితే తాజాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా యూనిట్ సువర్ణ అవకాశం ఇచ్చింది. ఈ సినిమాలో నటించేందుకు కొత్త నటీనటులను ఆహ్వానిస్తున్నామని చిత్ర యూనిట్ తాజాగా ‘ఫేసెస్ ఆఫ్ ఫ్యూచర్’ పేరుతో ప్రకటన విడుదల చేసింది. గ‌తంలో ప‌లు ఆడిష‌న్స్ నిర్వ‌హించిన మేక‌ర్స్ ఇప్పుడు బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఆడిషన్స్ పెడుతున్నట్టుగా తెలిపారు. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న వారు 12, 15 తేదీల్లో ఆడిష‌న్స్‌కి హాజ‌రు కావ‌చ్చు.

T2BLive.COM on Twitter: "#Prabhas Pan World Film #ProjectK Casting Call… "

Share post:

Latest