చరణ్-శంక‌ర్ మూవీ లాంచ్‌.. గెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో?!

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆ త‌ర్వ‌త త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోయే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించ‌నుంది.

- Advertisement -

Ram Charan to team up with sensational Director Shankar!

అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట తెగ చక్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే..ఈ మూవీని సెప్టెంబర్ 8న గ్రాండ్‌ను లాంచ్ చేయనున్నర‌ట‌.

Ranveer Singh to make his small screen debut with Colors' The Big Picture |  Entertainment News,The Indian Express

అంతేకాదు, ఈ లాంచింగ్ కార్య‌క్ర‌మానికి స్పెషల్ గెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌ని రాబోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, శంక‌ర్ ఇటు చ‌ర‌ణ్‌తో మూవీతో పాటుగా అటు హిందీలో రణ్వీర్ హీరోగా అపరిచితుడు రీమేక్ చేస్తున్నాడు. ఆ స‌న్నిహిత్యంతోనే ర‌ణ్మీర్‌ను స్పెష‌ల్ గెస్ట్‌గా ఇన్వైట్ చేయ‌గా.. వెంట‌నే ఆయ‌న ఒకే చెప్పాడ‌ని టాక్‌.

Share post:

Popular