అదిరిన `బిగ్‌బాస్ 5` ప్రోమో..ట‌న్నుల కొద్ది కిక్ అంటున్న నాగ్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇక మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ నిన్నే హౌస్‌లోకి వెళ్ల‌గా.. నేటి సాయంత్రం ఆరు గంట‌ల‌కు షో ప్ర‌సారం కానుంది.

ఈ నేప‌థ్యంలోనే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు తాజాగా ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ ప్రోమో ద్వారా ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఐదింత‌లు ఎనర్జీ ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి ఎంట‌ర్ అయ్యి.. కిక్ ఈసారి టన్నుల కొద్ది ఉంటుంద‌ని చెబుతూ షోపై హైప్ క్రియేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

Here is the latest change in Bigg Boss Telugu season 5 contestants list - TheNewsCrunch

మొత్తానికి అదిరిపోయిన తాజాగా ప్రోమో సీజ‌న్ 5పై అంచ‌నాల‌ను పెంచేసింది. కాగా, బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫైన‌ల్ లిస్ట్ అంటూ కొంద‌రి పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో డాన్స్ మాస్ట‌ర్ యాని, యాంక‌ర్ ర‌వి, యూ ట్యూబర్ షణ్ముఖ జ‌శ్వంత్‌, న‌ట‌రాజ్ మాస్టర్‌, శ్వేతా వ‌ర్మ‌, సీరియ‌ల్ న‌టి ప్రియ‌, ల‌హ‌రి, సీరియ‌ల్ హీరో మాన‌స్‌, యూ ట్యూబ‌ర్ స‌ర‌యు, లోబో, జ‌బ‌ర్ధ‌స్త్ ప్రియాంక, సిరి హ‌న్మంతు, కార్తీక‌దీపం న‌టి ఉమాదేవి, ఆర్‌.జె.కాజ‌ల్, సింగ‌ర్ శ్రీరామ‌చంద్ర‌, యాక్ట‌ర్ విశ్వ పేర్లు ఉన్నాయి.

Share post:

Popular