క‌డుపుతో ఉన్న సోహెల్‌..ఇంట్ర‌స్టింగ్‌గా `మిస్టర్ ప్రెగ్నెంట్` గ్లింప్స్‌!

September 5, 2021 at 11:49 am

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయిన కంటెస్టెంట్స్‌లో సయ్యద్ సోహెల్‌నే ముందు ఉంటారు. విన్న‌ర్ అభిజిత్ అయిన‌ప్ప‌టికీ.. అత‌డి కంటే ఎక్కువ‌గా సోహెల్‌నే క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ త‌ర్వాత సోహెల్‌తో సినిమాలు తీసేందుకు ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు ఫుల్ ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు.

Syed Sohel Ryan (Bigg Boss Telugu) Wiki, Age, Height, Girlfriend, Family, Biography & More – WikiBio

ఇక సోహెల్ న‌టిస్తున్న తాజా చిత్రం `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌`. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెబుటెంట్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ టైటిల్ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు.

Trailer: Bigg Boss Sohel Ryan Becomes Pregnant - Bigg Boss Sohel

ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్న టైటిల్ గ్లింప్స్‌లో సోహెల్ క‌డుపుతో ద‌ర్శ‌న‌మిచ్చాడు. దీనిని బ‌ట్టీ చూస్తుంటే సినిమాలో సోహెల్ ప్రెగ్నెంట్ గా కనిపించబోతున్నాడ‌ని, విభిన్న‌మైన కాన్సెప్ట్ తో సినిమా ఉండ‌బోతోంద‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. కాగా, ఈ చిత్రంలో సోహెల్ సరసన రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

క‌డుపుతో ఉన్న సోహెల్‌..ఇంట్ర‌స్టింగ్‌గా `మిస్టర్ ప్రెగ్నెంట్` గ్లింప్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)