`భీమ్లా నాయక్` ఖాతాలో స‌రికొత్త రికార్డ్‌..ఉబ్బిత‌బ్బిపోతున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్య దేవ‌ర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Injustice for Rana's role in Pawan Bhimla Nayak movie | OK Telugu

ఈ చిత్రంలో నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2న భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకున్న ఈ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతూ దూసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలోనే భీబ్లా నాయ‌క్ ఖాతాలో స‌రికొత్త రికార్డ్ వ‌చ్చి ప‌డంది.

Image

తాజాగా ఈ సాంగ్ 1 మిలియ‌న్ లైక్స్‌ను అందుకుంది. దాంతో టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా ఈ సాంగ్ రికార్డు నెలకొల్పింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్ట‌ర్ రూపంలో తెలియ‌జేయ‌డంతో.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిపోతున్నారు. కాగా, ఈ సాంగ్ థ‌మన్ సంగీత సార‌థ్యంలో రూపొంద‌గా, దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మొగులయ్య, జోసెఫ్, థమన్, శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, రామ్ మిరియాల ఆల‌పించారు.