ఆవులను జాతీయ జంతువుగా ప్రకటించండి… అంటున్న హైకోర్టు..?

హిందువులుగా గోమాతగా కొలిచేటువంటి జంతువు ఆవు.ఈ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది అలహాబాద్ హైకోర్టు.అంతేకాకుండా గో సంరక్షణకు హిందువుల ప్రాథమిక హక్కుగా చేయాలని పేర్కొంది.గోవధ నిందితుడైన జావేద్ కు బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ వాక్యాలను తెలియజేస్తుంది.ఇక ఈయన చట్టాన్ని ఉల్లంఘించడంతో అలహాబాద్ హైకోర్టు బుధవారం విరి బెయిల్ను తిరస్కరించింది.

- Advertisement -

ఇక హైకోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఆవును గౌరవించడం రక్షించడం భారత జాతీయ విధి అని తెలియజేసింది.అందుచేతనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి అంటూ తెలియజేసింది. ఆవును జాతీయ జంతువుగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు తీసుకురావాలని అన్నట్లుగా హైకోర్టు తెలియజేసింది.గోమాతలు సంతోషంగా ఉన్నప్పుడే మన దేశం కూడా సంతోషంగా ఉంటుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఇక గతంలో కూడా రాజస్థాన్ హైకోర్టు ఆవును జాతీయ జంతువు ప్రకటించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.అలా ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే.. మనుషులు ఆవులు చాలా సురక్షితంగా ఉంటారని చెబుతున్నారు. మూగజీవాలు,మానవ జీవితాలు సురక్షితంగా ఉండటం వల్ల దేశానికి ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేశారు.

Share post:

Popular