‘అసలేం జరిగిందంటే’ సినిమా.. అక్టోబర్ 1న రిలీజ్?

September 24, 2021 at 8:29 pm

మహేంద్రన్ ఈ పేరు చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ పెదరాయుడు, ఆహా, దేవి లాంటి సినిమాల్లో ఓల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మహేంద్రన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇలాటివి తెలుగు,తమిళ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించాడు. మహేంద్రన్ తాజాగా హీరోగా నటించిన చిత్రం అసలేం జరిగిందంటే. ఈ సినిమాకు శ్రీనివాAsalem Jarigindante Movie, mahendran, Sri Pallavi, Karunya Chaudhary, Karunya Katrin, Srinivas Bandari, Pedarayudu, Aha, Deviస్ బండారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కారుణ్య కత్రిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జి ఎస్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాను ఏబీఆర్ ప్రొడక్షన్స్ ద్వారా అనిల్ రెడ్డి సమర్పిస్తున్నారు.

ఈ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదిన విడుదల చేయబోతున్నట్లు ఈ చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను కుటుంబం అందరూ కలిసి చూసి ఆనందించేలా ఉంటుంది అంటూ దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలిపారు. హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి దొరబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని చరణ్ అర్జున్ అందించారు.

‘అసలేం జరిగిందంటే’ సినిమా.. అక్టోబర్ 1న రిలీజ్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts