మట్టి వినాయకుడిని తయారు చేసిన అల్లు అర్హ.. ఎంత క్యూట్ గా ఉందో?

దేశవ్యాప్తంగా భారతీయులు ఘనంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఈ పండుగ రోజున మొత్తం భారతీయులు అందరూ భారీగా గణనాథుడి విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వినాయకచవితి సందర్భంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా చిన్న మట్టి గణపతి ని తయారుచేసింది. అల్లు అర్హ తన చిట్టి చేతులతో మట్టి వినాయకుడిని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఈ ఫోటో చూసిన నెటిజన్లు వారు అర్హ అంటూ ఫిదా అవుతున్నారు.

అర్హ తయారుచేసిన ఆ మట్టి వినాయకుడి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్హ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్హ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అల్లరి చేస్తూ నెటిజన్లను ఫిదా చేస్తూ ఉంటుంది. అలాగే తన క్యూట్ మాటలు విన్న నెటిజన్లు ఫిదా అవ్వాల్సిందే. ఒక వైపు తండ్రి అల్లు అర్జున్ సినిమాలో బిజీగా ఉంటే, అల్లు అర్హ చేసే చిలిపి పనులు, అలాగే అల్లరి, తన యాక్టివిటీస్ అన్నిటిని అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.అల్లు అర్హ కి కూడా సోషల్ మీడియాలో అదే రేంజ్ లో ఫాలోవర్స్ వున్నారు.

Share post:

Popular