ఆకట్టుకుంటున్న అతిథి దేవోభవ ఫస్ట్ లుక్ పోస్టర్ ..!

ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న చిత్రం అతిథిదేవోభవ. ఆది దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.. ఇప్పుడు సరికొత్తగా తనలో కూడా మార్పులు చేసుకొని , సరికొత్త చిత్రాలతో ముందుకు దూసుకెళ్తున్నాడు. అంతేకాదు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ప్రతిభావంతులైన దర్శకులకు కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు ఆది. అంతే కాదు ఎవరైనా టాలెంట్ ఉండి, దర్శకత్వం వహించాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వారికి అవకాశం ఇస్తానని చెబుతున్నాడు ఆది సాయి కుమార్.

ఇక ఈ నేపథ్యంలోనే ఆది సాయి కుమార్ ఇటీవల శ్రీనివాస సినీ క్రియేషన్స్, బ్యానర్ ప్రొడక్షన్ నెం 1 కింద పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా చేస్తున్నాడు.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను అలాగే ఈ సినిమా టైటిల్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకు చిత్రం మేకర్ అతిధి దేవోభవ అనే టైటిల్ నిర్ణయించినట్లు, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండడంతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర మేకర్స్ తెలిపారు

Share post:

Popular