అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ముఖ్యమంత్రి..!

ముఖ్యమంత్రి అంటే నేరుగా ప్రజల లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలి..అప్పుడే ప్రజల కష్టనష్టాలను తీర్చడానికి సులువుగా ఉంటుంది.. అయితే అసలు సిసలైన ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.. స్టాలిన్ చేస్తున్న పనికి మొత్తం దేశవ్యాప్తంగా పొగడ్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని , వారిని కలిసి వారి సమస్యలను తీరుస్తున్న విషయం ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆదర్శం అని చెప్పాలి.

ఇకపోతే తాజాగా సేలం జిల్లా నుండి ధర్మపురి కి వెళ్తున్న మార్గం లో ఉన్న ఆథియమాంపేట పోలీస్ స్టేషన్ లో సీఎం స్టాలిన్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సీఎం స్టాలిన్.. అక్కడ పోలీస్ స్టేషన్ లో వస్తున్న ఫిర్యాదులు, వాటిపై పోలిసుల చర్యలు అన్నింటిపై అరా తీశారు. అంతేకాదు రాత్రి సమయం లో పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బందితో వారి సమస్యల గురించి కూడా ఆరాతీశారు. సీఎం స్టాలిన్ ఆర్థ్రరాత్రి పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సీఎమ్ ఉన్నట్టుండి సేలం కు రావడానికి గల కారణం ఏమిటంటే .. సేలం జిల్లా అరసిపాలయానికి చెందిన 13 యేళ్ల జనని అనే అమ్మాయి మూత్రపిండాల వ్యాధితో చెన్నై లో చికిత్స పొందుతోంది. ఇక ఆ పాప తల్లిదండ్రులు తమ కూతుర్ని కాపాడమని.. సీఎం స్టాలిన్ ని కోరుతూ.. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. చిన్నారి జనని వీడియోలకు స్పందించిన సీఎం స్టాలిన్ స్వయంగా చెన్నై లోని స్టాన్లీ హాస్పిటల్ కి వెళ్లి చిన్నారిని పరామర్శించారు. దారి మధ్యలో వస్తూ ఉండగా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది.

రాజకీయాలంటే కుట్రలు కాదు.. ప్రజలకు సేవచేయడం అనే నినాదాన్ని నమ్ముకున్న స్తాలింట్, ప్రతిపక్ష నేతలను కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అవకాశాలు కల్పించి, ప్రతిపక్ష నేతల నుంచి కూడా విమర్శలు పొందుతున్నారు.