బ‌క్క‌చిక్కిన ప్రియ‌మ‌ణి.. మ‌తిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్‌!

ప్రియ‌మ‌ణి.. ప‌రిచయం అవ‌స‌రంలేని పేరు. 2003లో `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన `య‌మ‌దొంగ` సినిమాతో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడిన ప్రియ‌మ‌ణి.. ఎన్నో హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

కేవ‌లం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషలలో న‌టించిన ఈ బ్యూటీ పెళ్లి త‌ర్వాత కొన్నేళ్లు సినీ ఇండస్ట్రీకి దుర‌మైన‌ప్ప‌టికీ.. మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌, టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న ఈ అమ్మ‌డు.. సోష‌ల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది.

ముఖ్యంగా ఈ మ‌ధ్య బ‌క్క‌చిక్కి మ‌రింత హాట్ గా త‌యారైన ప్రియ‌మ‌ణి.. వరుస ఫొటో షూట్స్ తో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా కూడా ఎల్లో అండ్ వైట్ క‌ల‌ర్స్ కాంబినేష‌న్‌లో కోట్, ప్యాంటు ధరించి సూపర్ స్టైలిష్ గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం మ‌తిపోగొడుతున్న ప్రియ‌మ‌ణి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మ‌ర‌గా.. వాటిపై నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

 

Share post:

Latest