సమంత, పూజా హెగ్డే, నిధి అగర్వాల్ మధ్య బంధం ఇదే!

నాగచైతన్య హీరోగా నటిస్తూ పలువురు హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలా ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ సమంత ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తర్వాత వీరు కొన్ని సినిమాలలో నటించి నిజజీవితంలో భార్యాభర్తలుగా సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలసి ఏం మాయ చేశావే, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. చైతన్య మొదటి చిత్రం జోష్ సినిమాతో రాధ కూతురు కార్తీక కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సవ్యసాచి సినిమాతో నిధి అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయం చేశారు.

అలాగే రామ్ గోపాల్ వర్మ గతంలో వచ్చిన బెజవాడ సినిమాతో అమలాపాల్ ను తెలుగు తెరకు పరిచయం చేశాడు నాగచైతన్య. అమలాపాల్ కూడా ఆ తర్వాత తెలుగుతో పాటు గా ఇతర భాషల్లో కూడా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా సినిమా కోసం సినిమాతో పూజా హెగ్డే ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాతో మడోనా సెబాస్టియన్ హీరోయిన్ పరిచయం చేశారు. సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో మంజిమా మోహన్ నీ కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సమంత, నిధి అగర్వాల్, పూజా హెగ్డే ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటంటే.. ఈ ముగ్గురు కలిసి నాగచైతన్య హీరోగా నటించిన సినిమాలతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.