ప‌వ‌న్‌కు పెరుగుతున్న మ‌ద్ధ‌తు..అండ‌గా ఆ యంగ్ హీరో ట్వీట్‌!

సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `రిప‌బ్లిక్‌` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పొలిటిక్ ఈవెంట్‌గా మార్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిప‌డ్డారు. సినిమా టికెట్స్ రేట్లు, ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు విషయంలో జ‌గ‌న్‌ స‌ర్కార్‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి.

- Advertisement -

Natural star Nani and Burning Star Sampoornesh babu extends their support to pawan

ఏపీ మంత్రులు ప‌వ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు. అయితే మ‌రోవైపు పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే హీరో నాని తనకు మద్దతుగా నిలిచినందుకు పవన్‌కు థ్యాంక్స్ చెప్ప‌గా.. సంపూర్ణేష్ బాబు కూడా ఆయ‌న మ‌ద్ధ‌తు తెలిపారు. ఇక ఇప్పుడు మ‌రో యంగ్ హీరో ప‌వ‌న్‌కు అండ‌గా నిలుస్తూ ట్వీట్ చేస్తున్నారు.

Telugu star Karthikeya to play the villain in Valimai? | Tamil Movie News -  Times of India

ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు.. `ఆర్ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ‌. తాజాగా ఆయ‌న `నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీకి మద్దతుగా నిలవడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లేవనెత్తిన సమస్యలు పరిగణించాల్సినవి. పరిశ్రమలోని సభ్యుడిగా మా అందరి తరుఫున మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడం నా బాధ్యత` అంటూ ట్వీట్ చేశాడు. దాంతో ఆయ‌న ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular