ఆ విషయంలో కుర్ర యాంకర్ తో గొడవ పడుతున్న రష్మీ..!

రష్మీ పుట్టింది ఒరిస్సా.. పెరిగింది మాత్రం విశాఖపట్నం.. ఇక యాంకర్ గా బుల్లి తెర పైకి అడుగుపెట్టిన యాంకర్ రష్మీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఈమె మొదట్లో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని , ఇబ్బందులు పడి చివరకు ఎట్టకేలకు జబర్దస్త్ వేదిక ద్వారా యాంకర్ గా అడుగుపెట్టింది. ఇక అలా తన అందచందాలతో, వాక్ చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న యాంకర్ రష్మి ,ఇటీవల ఒక యంగ్ యాంకర్ తో గొడవ పడినట్లు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెళితే , ఒక షో కి సంబంధించి యంగ్ యాంకర్ కు, రష్మీ కి మధ్య గొడవ జరిగిందట . ఇందుకు గల కారణం ఏమిటంటే.. ముందుగానే ఆ షో నిర్వాహకులు రష్మిని యాంకర్ గా చేయమని చెప్పి, ఆమెతో అగ్రిమెంట్ కూడా తీసుకున్నారట.. కానీ ఆ కుర్ర యాంకర్ రష్మీ కంటే తక్కువ రెమ్యునరేషన్ కే పని చేస్తాను అని చెప్పడంతో ఈ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగినట్లు సమాచారం..

ఒకసారి ఒకరు ఒక షో కి కమిట్ అయ్యారు అంటే, మధ్యలో దూర కూడదు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చివరకు ఈ షో కి ఎవరు యాంకర్ గా వ్యవహరిస్తారో వేచిచూడాల్సిందే..

Share post:

Latest