ఎన్టీఆర్ చేసిన ప‌నికి ఫ్యాన్స్ ఫిదా..ఇంత‌కీ ఏం చేశాడంటే?

ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌రోవైపు బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు ది బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేశాడు. ఆదివారం అట్ట‌హాసంగా ప్రారంభం అయిన ఈ షోకు మంది ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అందులోనూ ఫ‌స్ట్ గెస్ట్‌గా రామ్ చ‌ర‌ణ్ రావ‌డంతో షోకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యారు.

Jr NTR to start shooting for Evaru Meelo Koteeswarulu soon - Times of India

ఇదిలా ఉంటే..ఈ షో స్టార్ మా ఛానల్‌లో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి మూడు సీజ‌న్ల‌కు నాగ్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. నాల్గొవ సీజ‌న్‌కు చిరు హోస్ట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఐదో సీజ‌న్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోకు మొద‌ట‌ మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరు ఉండ‌గా.. దానిని `ఎవరు మీలో కోటీశ్వరులు`గా మార్చి జెమినీ టీవీ ప్ర‌సారం చేస్తున్నారు.

Jr NTR-hosted Evaru Meelo Koteeswarulu's first teaser launched; here's what  the host has to say about his comeback - Times of India

అయితే ఈ షోకు పేరు మార్చింది ఎవ‌రో కాదు తార‌క్‌నే అట‌. ఈ షోకి కేవలం మగవారు మాత్రమే కాకుండా ఆడవారు కూడా వస్తారు కదా అందుచేత కోటీశ్వరు’డు’ నుంచి కోటీశ్వరు’లు’ గా మార్పించానని తాజాగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ ఉన్న‌త‌మైన ఆలోచ‌న‌కు నంద‌మూరి అభిమానుల‌తో పాటు బుల్లితెర ప్రేక్ష‌కులు సైతం ఫిదా అవుతూ ఆయ‌న ప్ర‌శంస‌లు జ‌ల్లు కురిపిస్తున్నారు.

 

Share post:

Latest