వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న మహేష్ సోదరి..

సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆమె సోదరి మంజుల ఘట్టమనేని కూడా అందరికీ సుపరిచితమే. ఇక ఈమె నిర్మాతగా, దర్శకురాలిగా.. షో అనే జాతీయ అవార్డు చిత్రంలో మంజుల సోలోగా నటిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఒకే ఒక పాత్రలో రూపొందించిన చిత్రమిది. ఈ చిత్రానికి నీలకంఠ డైరెక్టర్ గా వ్యవహరించారు.

- Advertisement -

ఇక ఇప్పుడు సుమంత్ తో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ తెలుగు సినిమా”మళ్ళీ మొదలైంది”లో డాక్టర్ మిత్ర అనే థర్డ్ పీస్ట్ పాత్రలో పట్టిస్తున్నారు. తాజాగా ఈ పోస్టులు సోషల్ మీడియా ద్వారా మంజుల తెలియజేసింది. ఈ పోస్ట్ ని షేర్ చేసిన మంజుల ఈ వివరాలను కూడా వెల్లడించింది.

ఈ సినిమా ఎంతో కామెడీగా సాగిపోతుందని కూడా తెలియజేసింది. ఇక అంతే కాకుండా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలియజేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సుమంత్ పెళ్లి జరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. అదంతా పెళ్లి కాదు..కేవలం సినిమాలోని భాగమే అని తెలియజేసింది. ఇదంతా కేవలం ప్రమోషన్ కోసమే అంటూ చల్లగా తెలియజేసింది.

మంజుల విషయానికొస్తే, సమ్మర్ ఇన్ వెళ్లే హం. అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో సినిమాతో షో ద్వారా తను బాగా నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక తర్వాత నాని పోకిరి, కావ్యాస్ డైరీ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. ఇక 2018 లో విడుదలైన మనసుకు నచ్చింది అనే సినిమా తో ఆమె దర్శకురాలిగా మారింది. కానీ ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. చివరిసారిగా 2010లో రామ్ చరణ్ నటించిన ఆరంజ్ చిత్రంలో కనిపించింది ఈమె. ఈ సినిమాలో రామ్ చరణ్ సోదరిగా నటించి అందరిని మెప్పించింది.

Share post:

Popular