వరి కోత మిషన్లపై.. ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం..?

ప్రస్తుతం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కేవలం ప్రజల కోసమే. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా వరి నాట్లు నాటుతూ ఉన్నారు. దీంతో ప్రభుత్వం రైతుల కోసం తన వంతు సాయంగా ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు వరి సాగును మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత సహాయం చేకూరుస్తోంది.

అదేమిటంటే , రైతులకు ఇబ్బంది లేకుండా వరి కోసే మిషన్లను ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం దాదాపుగా 500 ప్రాంతాలలో వీటిని తీసుకువచ్చి, మిగిలిన వాటిని వచ్చే ఏడాది అన్ని చోట్ల అమలు పరిచే విధంగా చేయబోతోంది ప్రభుత్వం. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి ఏటా 60 శాతం వరకు పశ్చిమ గోదావరి , కృష్ణ , గుంటూరు జిల్లాలోనే ఎక్కువగా సాగు అవుతున్నది.

అంతేకాకుండా ప్రజలు పనులు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతుండటంతో ఇలాంటి యంత్రాల వల్ల వారికి కొద్దిగా ఊరట లభిస్తుంది. అంతేకాకుండా యంత్రాలు తక్కువగా ఉండడం చేత అధికంగా డబ్బులను వసూలు చేసి దళారులు రైతులను మోసం చేస్తున్నారు. అయితే RBK లలోనే వీటిని అద్దెకు విక్రయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతోంది. ఇక అంతే కాకుండా ఆ గ్రామంలోనే ఇది అందుబాటులో కూడా ఉండనుంది.

ప్రభుత్వం చెప్పిన కొన్ని నిబంధనల ప్రకారం అనుసరించి వరి కోత మిషన్ ను, గడ్డి చుట్టే యంత్రమును అందజేయనుంది. ఇక ఇందులో 40 శాతం వరకు రాయితీ ఇస్తుందట, అంతే కాకుండా 50 శాతం వరకు బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 103.50 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలుస్తోంది.

ఈ యంత్రాల వల్ల గ్రామాలలో ఉండేటువంటి యువతకు కూడా ఉపాధి లభిస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ యంత్రాన్ని మరమ్మతులపై కంపెనీ తో మాట్లాడి శిక్షణ ఇప్పించి వాటిని రిపేర్లు చేసేందుకు , ఆ గ్రామాలలోని యువతులకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా ఇలాగ సహాయం చేయడం రైతులకు ఎంతో ఊరటనిస్తుంది.