ఆర్థిక కష్టాల్లో నాని హీరోయిన్..ఆ వ‌య‌సులోనే అలా చేసింద‌ట‌?!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా తెర‌కెక్కిన `ఆహా కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది వాణీ క‌పూర్‌. 2014లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అయితే న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు వేయించుకున్న వాణీ క‌పూర్‌.. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌క‌పోయినా బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస సినిమాతో బిజీ అయింది.

Aha Kalyanam is close to Band Baaja Baarat' - Rediff.com Movies

ఇక ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న వాణీ క‌పూర్ ఒక‌ప్పుడు ఎన్నో క‌ష్టాలు ప‌డింద‌ట‌. 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని.. ఈ వ‌య‌సులోనే కుటుంబానికి అండగా నిలబడాలనే నిర్ణయంతో బాధ్య‌త‌ల‌న్నీ తానే తీసుకున్నట్లుగా ఇటీవల వాణీకపూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Vaani Kapoor Biography, Age, Height, Husband, Family, Movies

పరిస్థితులు మనిషిని ఎలాంటి స్థాయిలోకైనా నెట్టేస్తాయని.. కానీ వాటిని తట్టుకుని నిలబడినప్పుడే జీవితం ముందుకు సాగుతుందని.. ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్లాలని వానీ క‌పూర్ చెప్పుకొచ్చింది. కాగా, ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో రెండు, మూడు చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే త్వ‌ర‌లోనే టాలీవుడ్‌లోకి కూడా రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

 

Share post:

Latest