డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తెలుగు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అతనిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూరిజగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ ఈడి కార్యాలయానికి వచ్చారు.

ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2వ తేదీన హీరోయిన్ ఛార్మి, సెప్టెంబర్ 6 రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8 రానా, 9న రవితేజ, సెప్టెంబర్ 9 రవితేజ ను విచారించే రోజున అతని డ్రైవర్ శ్రీనివాస్ కూడా ఈడి ముందు హాజరు కానున్నారు. ఆతరువాత సెప్టెంబర్ 13 నవదీప్, 15న ముమైత్ ఖాన్, 17న తనిష్, 20 నందు, ఆఖరిగా సెప్టెంబర్ 22న తరుణ్ ఈడి ముందుకు రానున్నారు. 2017 లో హైదరాబాద్ లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రెతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

Share post:

Popular