జెనీలియా భ‌ర్త‌తో ప్లాన్స్ వేస్తున్న త‌మ‌న్నా..మ్యాట‌రేంటంటే?

జెనీలియా భ‌ర్త‌, బాలీవుడ్ న‌టుడు రితేష్ దేష్ ముఖ్ తో క‌లిసి ప్లాన్స్ వేస్తోంది మ‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బిజీగా ఉన్న మ‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా లాంగ్ గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

Image

త‌మ‌న్నా హీరోయిన్ గా, రితేష్ దేష్ ముఖ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `ప్లాన్ A ప్లాన్ B`. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించడం జరిగింది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్క‌బోతోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.

Image

ఈ చిత్రంలో వివాహమనేది తనకు తప్ప అందరికీ అవసరమని విశ్వసించే మ్యారేజ్‌బ్యూరో అధినేతగా తమన్నా క‌నిపించ‌బోతోంద‌ట‌. ఇక రితేష్ దేశ్ ముఖ్ కి ఇది తోలి డిజిటల్ చిత్రం కావడం విశేషం. కాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తమన్నా సోషల్ మీడియా లో షేర్ చేయ‌గా.. ప్ర‌స్తుతం అవి ఆక‌ట్టుకుంటున్నాయి.

Share post:

Popular