ఆస్తి కోస‌మే రామ్‌తో రెండో పెళ్లి..సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ టాప్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేవలం 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత.. కొన్నేళ్లకే భ‌ర్తకు విడాకులు ఇచ్చింది. ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంటూ చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉన్న సునీత ఈ మ‌ధ్యే బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది.

Ram Veerapaneni Wiki, Age, Wife, Family, Biography & More – WikiBio

ప్ర‌స్తుతం భ‌ర్త‌, పిల్ల‌ల‌తో లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది సునీత‌. అయితే ఈమె రెండో వివాహాన్ని కొంద‌రు స‌పోర్ట్ చేసినా.. కొంద‌రు మాత్రం ర‌క‌ర‌కాల‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆస్తి కోస‌మే రామ్‌ను సునీత పెళ్లి చేసుకుంద‌ని చాలా మంది కామెంట్ చేశారు. అయితే తాజాగా ఈ విష‌యంపై సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Ram Veerapaneni Biography, Age, Wikipedia, Engagement

ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సునీత మాట్లాడుతూ.. రామ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఎంద‌రూ సూటి పోటి మాట‌ల‌తో తీవ్రంగా ఇబ్బంది పెట్టార‌ని, ఈ రోజుకు కూడా జనాలు తనను కేవలం డ‌బ్బు కోస‌మే రామ్ ని పెళ్లి చేసుకున్నాన‌ని అంటున్నారని..కానీ, తాను రామ్‌ ఆస్తుల గురించి ఎప్పుడు ఆలోచించలేద‌ని చెప్పుకొచ్చింది. అసలు రామ్‌కు ఆస్తులు ఎన్ని ఉన్నాయి.. అతడి వ్యాపారాలకు సంబంధించిన టర్నోవర్‌ ఎంత అనే విషయాలను తాను ఎప్పుడు కూడా ప్రశ్నించలేద‌ని క్లారిటీ ఇచ్చింది.

 

Share post:

Popular