సోషల్ మీడియా అనేది ఓ అద్బుత ప్రపంచం. ఈ వేదికపై హీరోల అప్ డేట్స్ హల్ చల్ అవుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఇండియా హీరోలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ హీరోలకు ఎక్కువ పాపులారిటీ ఉంది. మరి ఈ సంవత్సరంలో జనవరి 1వ తేది నుంచి జూన్ నెల 30వ తేదీ వరకూ కూాడా భారత్ లో అనేక హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో కిక్కిరిసిపోయాయి.
ఈ హ్యాష్ ట్యాగ్ గు సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి ఇటువంటి హ్యాష్ ట్యాగ్ లో మొదటి స్థానంలో వలిమై ఉంది. ఆ తర్వాత మాస్టర్, మూడో స్థానంలో సర్కారువారి పాట వంటివి ఉన్నాయి. ఇకపోతే 4వ ప్లేస్ లో అజిత్ కుమార్, 5వ స్థానంలో తలపతి65 ఉండగా 10వ స్థానంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పేరు ఉంది. టాప్ హ్యాష్ ట్యాగ్ లో పవన్, మహేష్ పేర్లు ఉండటంతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.